కోహ్లీని భయపెట్టిన ధోనీ బ్యాటింగ్

  • In Sports
  • April 22, 2019
  • 167 Views
కోహ్లీని భయపెట్టిన ధోనీ బ్యాటింగ్

బెంగళూరు : చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, సీఎస్‌కే
మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులనే కాదు ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లీని కూడా తీవ్ర
ఉత్కంఠకు గురి చేసింది. ఒక పరుగు తేడాతో ఆర్‌సీబీ విజయాన్ని సొంతం చేసుకోగా, ధోనీ విజృంభణ
చూసి కోహ్లీ కూడా భయపడ్డాడట. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఈ ఐపీల్‌ సీజన్‌లో
తాము కొన్ని మ్యాచులను చాలా తక్కువ పరుగుల తేడాతో ఓడిపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో
గెలుస్తామని తొలుత ధీమాగా ఉన్నప్పటికీ, ధోనీ ఆటతీరుతో కొద్దిగా భయపడ్డానని తెలిపాడు.
తాను భావోద్వేగానికి గురయ్యానని అంటూ, 19వ ఓవర్‌ వరకు తమ ఆటగాళ్లు అద్భుతంగా బౌలింగ్‌
చేశారని కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్‌లో 200 సిక్సులు దాటిన తొలి భారత ఆటగాడిగా ధోనీ
రికార్డు సృష్టించాడు. ఇప్పటి దాకా మొత్తం 203 సిక్సులు బాదాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos