Mr.పర్ఫెక్ట్ ఆ నవలకు కాపీనే..

  • In Film
  • April 22, 2019
  • 243 Views
Mr.పర్ఫెక్ట్ ఆ నవలకు కాపీనే..

ప్రభాస్‌,కాజల్‌లు
జోడీగా దశరథ్‌ దర్శకత్వంలో 2011వ సంవత్సరంలో విడుదలై ఘనవిజయం సాధించిన మిస్టర్‌ పర్ఫెక్ట్‌
సినిమా తాను రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచియత కోర్టు దాఖలు చేసిన పిటిషన్‌పై
సిటీ సివిల్‌ కోర్టు ఆసక్తితీర్పు వెల్లడించింది.మిస్టర్‌ పర్ఫెక్ట్‌ సినిమా రచయిత
ముమ్ముడి శ్యామల దేవి రచించిన నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా తెరకెక్కించారంటూ
కోర్టు తీర్పు వెల్లడించింది.సినిమాలోని కథతో పాటు మాటలు,సన్నివేశాలు మొత్తం నవల నుంచి
తీసుకున్నవేనని నిర్ధారించిన నిర్మాత,దర్శకుడిపై కోర్టు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ
పోలీసులకు సూచించింది.దీనిపై రచయిత శ్యామలా దేవి స్పందిస్తూ..‘‘ మిస్టర్‌ పర్ఫెక్ట్‌
విడుదలైన సమయంలో నేను అమెరికాలో ఉన్నా.రెండేళ్లు గడిచాక 2013లో సినిమాలో మిస్టర్‌ పర్ఫెక్ట్‌
సినిమా వస్తుంటే చూశారు.మొత్తం సినిమా చూశాక సినిమాలోని ప్రతీ సన్నివేశం,మాటలు,కథ నా
నవల నుంచే తీసుకున్నట్లు నిర్ధారించుకున్నా.దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజును సంప్రదించడానికి
ప్రయత్నించగా దిల్‌రాజు అవకాశం ఇవ్వలేదు.మరోసారి నా అనుమతి లేకుండా నా నవలను ఆధారంగా
సినిమా ఎలా తీశారంటూ ప్రశ్నించగా ఇది మీ నవల నుంచి తీసుకున్న కథ కాదని 2009లోనే కథ
రాసుకున్నానని అప్పుడే కథా రచయితల సంఘంలో రిజిస్టర్‌ చేసుకున్నామని దర్శక నిర్మాతలు
తప్పుడు ఆధారాలు చూపించడానికి యత్నించారు.దీనిపై కథా రచయితల సంఘానికి ఫిర్యాదు చేయగా
అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.సాధారణంగా ప్రతీ నవలను మూడు నెలల్లో పూర్తి చేస్తాను..కానీ
ఈ నవలకు మాత్రం ఏడాది సమయం పట్టింది.నవలలో 30 సన్నివేశాలను ఏమాత్రం మార్పులు కూడా చేయకుండా
ఉన్నది ఉన్నట్లుగా దించేశారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం
రీమేక్‌ ఘనవిజయం సాధించింది.నాకు దక్కాల్సిన గుర్తింపు నా నవల కాపీ కొట్టి సినిమాను
తెరకెక్కించిన దశరథ్‌కు దక్కుతుంటే సహించలేకపోయా.నా కథను కాపీ కొట్టి నా కెరీర్‌ను
దెబ్బ తీశారు.ఈ పోరాటం ప్రారంభించాక కథలు రాయడం తగ్గించాను.నన్ను ఇన్నేళ్లపాటు బాధ
పెట్టినందుకు కచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే.నష్టపరిహారం అడగడం వెనుక ఉద్దేశం
నేనేదో కోట్లు గడించేద్దామని కాదు..అనుమతి లేకుండా కథను కాపీ కొట్టడమే కాకుండా ఇన్నేళ్లపాటు
బాధకు గురి చేసినందుకు దర్శక నిర్మాతలకు విధించాల్సిన శిక్ష అంతే.ఇక సినిమాలో హీరోగా
నటించిన ప్రభాస్‌ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ..దశరథ్‌ డైరెక్టర్‌గా కంటే రచయితగా
నచ్చారని చెప్పిన మాటలు విని నన్ను మెచ్చుకున్నట్లు ఫీలయ్యా.ఈ కేసు గెలిచాక ఒక్కసారి
ప్రభాస్‌ను కలవాలనేది నా కోరిక’’ అని తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos