వెంకన్న హుండిలో డబ్బులేయ వద్దు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో ఒక్కరూపాయి కూడా వేయొద్దని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు భక్తులను కోరారు. ఓ యూట్యూబ్ ఛానల్తో ఆయన మాట్లాడారు .తిరుమల హుండీల్లో భక్తలు వేసే ఒక్క రూపాయి కూడా స్వామి సేవకు వినియోగించడంలేదని తెలిపారు. పచ్చకర్పూరం, కస్తూరి నుంచి పుష్పాలు, వస్త్రాలు, అలంకరణలు, ఉత్సవాలన్నిటికీ భక్తులే సహాయం చేస్తారని చెప్పారు. రోజుకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ లభిస్తున్నహుండీ ఉద్యోగులకు, ఇంజినీరింగ్ పనులకు, కాంట్రాక్టర్లకు, ధర్మ ప్రచారానికే వ్యయం చేస్తున్నారని విశదీక రించారు. హుండీ డబ్బులను పాపకార్యాలకు వినియోగించటం భక్తులకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.తిరుమల హుండీలకు బదులుగా నిత్య సేవలకు నోచుకోని ఆలయ అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళాలు ఇవ్వడం మేలని సూచించారు. విరాళాలు ఏ ఆలయంలో ఇచ్చినా స్వామికే చేరుతా న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos