ప్రచారరథంలో మంటలు..హరీశ్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం..

ప్రచారరథంలో మంటలు..హరీశ్‌రావుకు తృటిలో తప్పిన ప్రమాదం..

సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,మాజీ మంత్రి హరీశ్‌రావు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న హరీశ్‌రావు వాహనంపై నిల్చొని ప్రసంగిస్తుండగా ప్రచార వాహనంలోని జనరేటర్‌ వేడెక్కి పొగలు వ్యాపించాయి.అదే సమయంలో డీజల్‌ కూడా లీక్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.వాహనం వెనుక ఉన్న నేతలు భూపతిరెడ్డి,ప్రతాపరెడ్డి తదితరులు వెంటనే వాహనం దిగిపోగా మధ్యలో ఉన్న నర్సాపుర ఎమ్మెల్యే మదన్‌రెడ్డి,ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు కూడా వాహనం నుంచి దిగిపోయారు. మంటలు ఆర్పడానికి నేతలు ప్రయత్నించగా మంటలు మరింత ఉధృతమవడంతో ప్రచార రథం ముందుభాగంలో ఉన్న హరీశ్‌రావు,మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకరరెడ్డి వాహనం దిగి దూరంగా వెళ్లారు.అనంతరం తెరాస నేతలు, కార్యకర్తలు స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేశారు.ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతె తెరాస శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos