పోలీసులకు మందు పార్టీ ఇచ్చి ఖైదీ పరార్

  • In Crime
  • March 29, 2019
  • 182 Views
పోలీసులకు మందు పార్టీ ఇచ్చి ఖైదీ పరార్

మీకు మంచి మందు పార్టీ ఏర్పాటు చేశాను సార్, ఖుషీ చేయండి…అంటూ ఓ ఖైదీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయారా పోలీసులు. ఆ ఖైదీ మాట ప్రకారం పార్టీ అయితే ఇచ్చాడు కానీ, పోలీసులు మద్యం మత్తులో జోగుతుండగానే అక్కడి నుంచి చెక్కేశాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ సంఘటన. హత్య, దోపిడీలు సహా సుమారు పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఠా నాయకుడు బద్దాన్ సింగ్ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఫతేగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అతనిని మరో కేసు విచారణ నిమిత్తం ఘజియాబాద్ తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేశారు. మార్గ మధ్యంలో మంచి మందు పార్టీ ఏర్పాటు చేశానని బద్దన్ పోలీసులను నమ్మించి, మీరట్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. తన అనుచరులతో అక్కడ పోలీసులకు మందు పార్టీ ఏర్పాటు చేశాడు. పోలీసులు బాగా మత్తులో ఉన్న సమయంలో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఓ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నారు. ఓ న్యాయవాది హత్య కేసులో బద్దాన్ దోషిగా తేలడంతో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos