సిబిఐ దర్యాప్తుకు భయపడుతున్నబాబు

కందుకూరు: తన మరిది, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐచే దర్యాప్తు జరిపించేందుకు భయపడుతున్నారో చెప్పాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఇక్కడ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అందరి సంక్షేమం, అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు, అర్హత లేదని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకోవాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos