వీవీప్యాట్ రసీదుల లెక్కింపును పెంచాల్సిన అగత్యం లేదు

న్యూ ఢిల్లీ : లోక్సభ, విధానసభ ఎన్నికల్లో లెక్కించే వీవీప్యాట్ రసీదుల సంఖ్యను పెంచాల్సిన అగత్యం లేదని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అత్యున్నత న్యాయ స్థానానికి వెల్లడించింది.యాభై శాతం వివిపాట్ల రసీదుల్ని లెక్కిస్తే ఫలితాల ప్రకటనలకు ఆరు రోజుల వ్యవధి పడుతుందని అంచనా వేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 50 శాతం వీవీప్యాట్ రసీదుల్ని లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ 21 రాజకీయ పక్షాల పార్టీల నేతలు సుప్రీంకోర్టులోవ్యాజ్యాన్ని దాఖలు చేయటం తెలిసిందే. దరిమిలా న్యాయ స్థానం ఆదేశానుసారం ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని న్యాయ స్థానానికి శుక్రవారం నివేదించింది. ప్రస్తుత విధానాన్ని సమర్థించుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అవలంభించదలచినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఒక విధానసభ నియోజక వర్గంలోని ఒక్క వీవీప్యాట్ రసీదుల్ని మాత్రమే లెక్కి స్తున్నారు. వీటి శాతం పోలైన ఓట్లలో కేవలం 0.44. దీని వల్ల కచ్చితత్వం తెలియదని ప్రతి పక్షాలు అభిప్రాయ పడ్డాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిం చేందుకు కనీసం 50శాతం వీవీప్యాట్‌ రసీదుల్ని లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos