పోకిరిలో నేను నటించాల్సింది..

  • In Film
  • March 29, 2019
  • 172 Views

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి
మాటల తూటాలు పేల్చింది.బాలీవుడ్‌ నటీనటులైన రణ్‌బీర్‌ కపూర్‌,అలియాభట్‌లపై కంగనా విరుచుకుపడింది.37
ఏళ్ల వయసుకున్న రణబీర్‌,27ఏళ్ల వయసున్న అలియాలను యువతారలుగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది.27ఏళ్ల
వయసులో నా తల్లి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందన్నారు.అటువంటి సదరు నటీనటులను యువతారలుగా
పేర్కోవడం శుద్ద దండగన్నారు.నా సెక్సువల్‌ లైఫ్‌ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని
ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఎవరితో పడుకున్నానో ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే దేశం మొత్తం తెలుస్తుంది
కదా అంటూ మండిపడ్డారు.రణబీర్‌,అలియాలు తమ మధ్య వయసు తేడా మరచిపోయి ప్రేమలో గుడ్డిగా
మునిగి తేలుతున్నారంటూ ఫైర్‌ అయింది కంగనా.తమను తాము గొప్పవాళ్లుగా ఊహించుకుంటున్న
అలియా,రణ్‌బీర్‌,కరణ్‌జొహార్‌లు మిగిత భాషల్లో పీకిందేమి లేదంటూ విరుచుకుపడింది.నా
చిత్రాలు వరసుగా విజయం సాధిస్తుండడంతో అభద్రతా భావానికి లోనై నాపై వ్యతిరేకంగా దుష్ప్రచారం
చేస్తున్నారంటూ ఆరోపించారు.ఇక తెలుగు సినిమా గతిని మార్చేసిన పోకిరి చిత్రంలో ఆఫర్‌
మిస్సవడంపై కూడా స్పందించింది. పూరి జగన్నాధ్ ‘పోకిరి’ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని ‘పోకిరి’ ఆడిషన్స్ లో హాజరయినట్లు తెలిపింది.అదే సమయంలో ‘గ్యాంగ్ స్టర్’ ఆడిషన్స్ కు కూడా హాజరైనట్లు తెలిపింది. రెండూ సినిమాలకు హీరోయిన్ గా సెలక్ట్ అయినా రెండిట్లో ‘గ్యాంగ్ స్టర్’ సినిమాను ఎంపికచేసుకున్నానని తెలిపింది.ఆ విధంగా పోకిరి చిత్రంలో ఆఫర్‌
మిస్సయినట్లు గుర్తు చేసుకుంది. కానీ కొంతకాలం తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించానని తెలిపింది. కంగనా మిస్ చేసుకున్న చిత్రాన్ని ఇల్లీ బేబీ పట్టేసింది.. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లో టాప్ హీరోయిన్ అయ్యింది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos