అనుకున్నట్లుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై తెలుగుదేశం విజయం సాధించింది.లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ తెదేపా నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రం విడుదలపై స్టే విధించగానే ఆర్జీవీ ట్విట్టర్‌లో పరోక్షంగా తెదేపాపై విరుచుకుపడ్డారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో? అంటూ ట్వీట్ చేశారు.‘సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్‌కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం.. ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక.. తధాస్తు” అంటూ రామ్ గోపాల్ వర్మ తన అసంతృప్తి వ్యక్తం చేశారు.24 ఏళ్ల కిందట వైస్రాయ్ హోటల్‌లో ఏం జరిగిందనే విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు.అప్పటి వెన్నుపోటు ఉదంతంలో ఎవరెవరు కీలకపాత్ర పోషించారనే విషయం అందకిరీ తెలిసిన రహస్యమన్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తీయడానికి ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కారణమన్నారు.ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని నన్ను సంప్రదించినపుడు లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లేకుండా తీయలేనని స్పష్టం చేయడంతో బాలకృష్ణ వెనక్కి తగ్గారని దీంతో మరో దర్శకుడితో తనకు నచ్చిన విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయడంతో వాస్తవాలను చూపిస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించానన్నారు.ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన అన్ని ప్రపంచమంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్టే విధించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం..