కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఫిర్యాదులు..

కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఫిర్యాదులు..

రెవెన్యూ అధికారుల
భాగోతాన్ని శరత్‌ అనే రైతు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తేవడం శరత్‌ వీడియోపై
స్పందించిన సీఎం కేసీఆర్‌ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు గంటల వ్యవధిలో శరత్‌
సమస్యను తీర్చడంతో ఇలాంటి సమస్యలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.తెలంగాణ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు పట్టా ప్రక్షాళన,పట్టపాస్‌ బుక్‌లను ఆన్‌లైన్‌లో పెట్టడానికి
వీలుగా ధరణి వెబ్‌సైట్‌,పాస్‌బుక్‌ అవసరం లేకుండానే రుణాల మంజారు ఇలా అన్ని ప్రణాళికల్లో
కిందిస్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్‌ వరకు ప్రతీ ఒక్కరూ నిర్లక్ష్యం వహిస్తూ రైతులను
సమస్యలను తీర్చడంలో విఫలమవుతున్నారు.ఈ క్రమంలోనే తన భూమిని మరొకరి పేరుతో పట్టా చేశారని
దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంచిర్యాల
జిల్లాకు చెందిన శరత్‌ అనే రైతు ఫేస్‌బుక్‌లో నేరుగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు.దీనిపై
స్పందించిన కేసీఆర్‌ ఒక్క రోజులోనే శరత్‌ సమస్యను తీర్చడంతో అన్ని జిల్లాల నుంచి రైతులు
తమ సమస్యల గురించి సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల
పుణ్యామా అని అధికారుల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా సీఎం కేసీఆర్‌ దృష్టికి వస్తున్నాయి.
కుప్పలుతెప్పలుగా వస్తున్న ఫిర్యాదులను కేసీఆర్‌ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos