ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబుకు శాసనసభ ఎన్నికల్లో రిటర్న్‌గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ చెబుతుంటే
లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌కు తాను రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానంటూ మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి
చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ
స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో తెరాస అధినేత కేసీఆర్‌పై లోలోపలే అసహనంతో రగిలిపోతున్న
జితేందర్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో
చేరిన విషయం తెలిసిందే.ప్రధాని నరేంద్రమోదీ శత్రుదేశమైన పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్
చేస్తుంటే సీఎం కేసీఆర్ తన స్నేహితులపై సర్జికల్ అటాక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు.ఈసారి
లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదనే విషయంపై కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా
టికెట్ నిరాకరించారంటూ ఆరోపించారు.కేసీఆర్ తనను ఘోరంగా అవమానించి కిందపడేస్తే బీజేపీ
ఆదరించిందన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను గెలిపించి కేసీఆర్‌కు
రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానని తెలిపారు.మహబూబ్‌నగర్‌లో కషాయం జెండా రెపరెపలాడడం తథ్యమని
డీకే అరుణ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.జితేందర్‌రెడ్డి చేరికతో
మహబూబ్‌నగర్‌లో బీజేపీకి అదనపు బలం చేకూరిందంటూ మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే
అరుణ తెలిపారు.