కేసీఆర్‌కు ఎన్నికల సంఘం తాఖీదు..

రెండవ సారి అధికారంలోకి వచ్చాక తెరాస పార్టీతో పాటు తెరాస అధినేత కేసీఆర్‌కు కొద్దిగా బ్యాడ్‌టైడ్‌ నడుస్తున్నట్లు కనినిస్తోంది.మొదటిసారి అంతా సాఫీగా జరిగిన తెరాసకు రెండవసారి షాకులపై షాకులు తగులుతున్నాయి.పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు రాజీనామాలు చేసి వెళ్లిపోగా తెరాస అధినేత కేసీఆర్‌కు తాజాగా ఎన్నికల సంఘం నుంచి తాఖీదులు రావడం తెరాస శ్రేణులను కలవరపెడుతోంది. కొద్ది రోజుల క్రితం గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫడవిట్‌లో కేసుల గురించి పూర్తి సమాచారం పొందుపరచలేదంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.ఇది జరిగిన కొద్ది రోజులకు ఈసారి నేరుగా ఎన్నికల సంఘం నుంచి తాఖీదులు రావడంతో తెరాస నేతలు కలవరపడుతున్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తర్వాత తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్… సెక్రటేరియట్ ఉన్నా… ప్రగతి భవన్ పేరిట సీఎంకు అధికార నివాసాన్ని కొత్తగా కట్టారు. అప్పటినుంచి ప్రగతి భవన్ వేదికగానే పాలన సాగిస్తున్న కేసీఆర్… టీఆర్ ఎస్ కు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు కూడా ప్రగతి భవన్ నే కేంద్రంగా చేసుకున్నారు. ఈ విషయంపై ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా… తాజాగా కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సీఎం అధికార నివాసాన్నిరాజకీయ కార్యకలాపాలకు ఎలా వాడతారంటూ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదును ఆధారంగా ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి రజత్ కుమార్ చాలా వేగంగానే స్పందించారు. సీఎం అధికారిక నివాసంలో రాజకీయ కార్యకలాపాలు ఎలా సాగిస్తారంటూ ఆయన టీఆర్ ఎస్ కు నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.ఈసీ జారీ చేసిన నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలని కూడా టీఆర్ ఎస్ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos