పూంఛ్‌లో పాక్‌ కాల్పులు

జమ్ము: పాకిస్థాన్ శుక్రవారం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. పూంఛ్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జవాన్లు మోటార్‌ షెల్లింగ్‌లు విసిరారు. భారత జవాన్లపైకి కాల్పులు జరిపారు. ఆ కాల్పులను మన వారు ధాటిగా తిప్పికొ ట్టారని సైనిక అధికారులు వెల్లడించారు.
ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్ములోని నౌగమ్‌ ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి.అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం భద్రతాసిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ దశలో ఒక ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన సిబ్బంది ఇద్దరు ఉగ్ర వాదులను మట్టు బెట్టారు. కొందరు తప్పించుకుని పారి పోయి ఉంటారని భావించిన బలగాలు వారి కోసమూ గాలింపుల్ని చేపట్టింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos