వంద కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో చాలా మంది ప్రజలు వాస్తు,జాతకాలు,ముహూర్తాలను బలంగా నమ్ముతుంటారు.ముఖ్యంగా సినిమా,రాజకీయ రంగాల్లో వాస్తు,ముహూర్తం,జాతకాలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.వాస్తు,ముహూర్తం,జాతకాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లో నమ్మకం పాళ్లు కాస్త ఎక్కువేనని చెప్పాలి.అయితే అదే కేసీఆర్ బలం.. బలహీనత.. కానీ ప్రత్యర్థులకు ఇదో విమర్శనాస్త్రం.. పోయిన దఫాలో సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లకపోవడం.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బేగంపేటలో వాడిన సీఎం అధికారిక నివాసాన్ని వాస్తు బాగాలేదని వాడకపోవడం.. ఆరునెలల్లోనే ‘ప్రగతి భవన్ ’ నిర్మించడం లాంటివి చేశారు.దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేంవత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కు వాస్తు పిచ్చి అంటూ అవహేళన చేశారు. రేవంత్ అయితే ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.అలయితే గత డిశెంబర్‌లో జరగిన శాసనసభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోయారు.అంతే ఒకేఒక్క ఓటమితో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ దారిలోకి వచ్చాడు.ఓటమిపై కారణాలు విశ్లేషించిన రేవంత్‌రెడ్డికి ఇంటి వాస్తులో దోషం ఉన్నట్లు వాస్తు జ్యోతిష్యులు తెలిపారట.ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాంటే ఇంట్లో మార్పులు చేయాలని సూచించారట.అంతే జూబ్లిహిల్స్‌లో ఉన్న ఇంట్లో మార్పులు చేయించాడు. శాసనసభ ఎన్నిలకు ముందు దక్షిణం వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేయించి ఉత్తరం వైపు మూల ఈశాన్యంలో ఏర్పాటు చేయించాడట.దీంతోపాటు వాష్‌రూమ్‌ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేయించాడట.ఇలా వాస్తు పిచ్చోడంటూ విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ బాటలోనే వాస్తులు మార్పులు చేయడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది..