స్టాక్‌ మార్కెట్లకు లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో 38,618 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 11,583 వద్ద ట్రేడయ్యింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.13 వద్ద దాఖలైంది.ఇరాన్, వెనెజువెలాపై ఒపెక్, అమెరికా ఆంక్షల వల్ల చమురు ఎగుమతుల పరిమాణం తగ్గటంతో దాని ధర పెరిగింది. ఐఓసీ, ఇండియా బుల్స్ హౌసింగ్, హిందాల్కో, విప్రో, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, వొడాఫోన్ ఐడియా, జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభాల్లో ట్రే డ్ కాగా ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, మదర్సన్ సుమీ షేర్లు నష్టాల్లో ముఖం పట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos