విజయవాడ : ఆంధ్రాలో తెదేపాను అన్ని లోక్సభ
స్థానాల్లో గెలిపిస్తే, రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఢ్లిలీ ముఖ్యమంత్రి
కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన కృష్ణా జిల్లా మైలవరం
నియోజకవర్గం జక్కంపూడి కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. జగన్కు
ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని గుర్తుంచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. విభజన వల్ల
ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, చంద్రబాబు అభివృద్ధిని చూపించారని ప్రశంసించారు.
తెదేపాను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరడానికే తాను ఇక్కడికి వచ్చానని
తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీని ఓడించాలని, రాష్ట్రం బాగు పడాలంటే చంద్రబాబును
గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.