హైదరాబాద్ : అపర బకాసురుడిలా శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దోసె తినడం…ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. మురళీధరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీసు పూర్తయిన తర్వాత ఆటగాళ్లందరూ టిఫిన్ ఆరగించడానికి హోటల్‌కు వెళ్లారు. ఆ సందర్భంలో మురళీధరన్ దోసె తింటుండగా ఆటగాళ్లు ఫొటో తీశారు. సన్‌రైజర్స్ ప్లేయర్ శ్రీవత్స గోస్వామి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకంటే బాగా అల్పాహారం ఎవరూ తీసుకోలేరేమో అని ట్వీట్ కూడా చేశాడు. ఈ ఫొటోపై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.