నిజామాబాద్ : తమ పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న రైతులు తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిశాక 185 నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులందరూ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగినా, కేవలం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే వైదొలిగారు. కనుక బ్యాలెట్ పేపర్‌ను ముద్రించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమార్తె కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.