హెలికాప్టర్లలో డబ్బు దొంగ రవాణా

అమరావతి:ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లోనే డబ్బును అక్రమంగా తరలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిం చారు..ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ధనం సరఫరాకు పోలీసు వాహనాలను వాడుతున్నారనీ ఆరోపించారు. ఠాకూర్ను డీజీపీ పదవి నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏనాడైనా పోటీ చేసి గెలిచారా? తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసే, వ్యాఖ్యానాలు చేసే అర్హత కుటుంబరావుకు లేదన్నారు. ఎన్నికల్లో తెదేపా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos