ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల వ్యవధిలో రైతు శరత్ కుటుంబానికి న్యాయం చేసి తన మాట నిలబెట్టుకున్నారు.సామాజిక మాధ్యమాలు వేదికగా మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు శరత్ తన ఏడెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుతో పట్టా చేశారని దీనిపై రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించకోలేదంటూ తనగోడు వెళ్లబోసుకున్నాడు.సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో సీఎం కేసీఆర్ దృష్టిలో పడింది.వెంటనే వివరాలు తెలుసుకున్న కేసీఆర్ రైతుకు ఫోన్ చేసి గంటల వ్యవధిలో న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.కేసీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి బాధితుడు శరత్ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తమ ఏడెకరాల భూమిని రెవెన్యూ అధికారులు అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తలకు పట్టా చేశారంటూ ఆరోపించాడు.లంచాలు తీసుకొని రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేశారంటూ ఆరోపించాడు.బాధితుడు చెప్పిన వివరాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ శరత్‌కు అన్యాయం జరిగినట్లు గుర్తించి వెంటనే శరత్ కుటుంబానికి చెందిన భూమి పట్టాను శరత్ తండ్రి శంకరయ్యకు అందించారు.దీంతోపాటు భూవివాదం కారణంగా నిలిచిపోయిన రైతు బంధు పథకం ద్వారా రావాల్సిన రూ.31,200 డబ్బులను కూడా అత్యవసర నిధుల ద్వారా చెక్కుల రూపంలో అందించారు.దీనికి కారణమైన ఆర్‌ఐ పెద్దిరాజుతో పాటు వీఆర్‌ఓ కరుణాకర్‌ను సస్పెండ్ చేశారు.దీంతోపాటు అప్పటి ఎమ్మార్వో రాజలింగుపై కూడా ఆదేశాలు జారీ చేశారు..