నన్ను బోకుగాడు అంటడా?నెటిజన్‌పై కేసీఆర్‌ ఫైర్‌..

నన్ను బోకుగాడు అంటడా?నెటిజన్‌పై కేసీఆర్‌ ఫైర్‌..

ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏవిధంగా
స్పందిస్తారో తాజాగా తన సమస్యను వివరిస్తూ మంచిర్యాలకు చెందిన యువరైతు ఫేస్‌బుక్‌లో
పెట్టిన వీడియో ఎపిసోడ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసింది.అయితే యువరైతు
ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను అధికారులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఉండొచ్చని లేకుంటే
కేసీఆర్‌ సామాజిక మాధ్యమాలను పరిశీలించలడమేంటని అందరూ అనుకుంటున్న మాట.అలా అనుకునే
వాళ్లు తమ అభిప్రాయాలను మార్చుకోక తప్పదు.ఎందుకంటే కేసీఆర్‌ సామాజిక మాధ్యమాలను తరచూ
పరిశీలిస్తూనే ఉంటారనే విషయం మరోసారి రుజువైంది.తన సమస్య గురించి వివరిస్తూ శరత్‌ అనే
రైతు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను పరిశీలించిన కేసీఆర్‌ అందులో కమెంట్స్‌లో ఓ యువకుడు
సీఎం కేసీఆర్‌ ఓ బోకుగాడు అంటూ కమెంట్‌ చేయడాన్ని కూడా గమనించారు.రైతు పెట్టిన పోస్ట్ కు నెటిజన్ ఒకరు తనను బోకుగాడు అంటూ తిట్టటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక సీఎంను అనే మాటేనా? ఇది అంటూ ప్రశ్నించారు. పోస్టు పెట్టటం పెద్ద విషయం కాదని.. రాత రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా రాయాలని.. జిమ్మేదార్ గా ఉండాలన్నారు.తనను బోకుగాడంటూ తిట్టేసిన నెటిజన్ గురించి ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేపొద్దున చర్యలు కూడా తీసుకోవచ్చు. అయినా.. సీఎం చర్యలు తీసుకుంటారో లేదో తర్వాత.. మన వరకు మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉందన్నది మర్చిపోకూడదు. మిగిలిన సీఎంలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి విషయాన్ని డేగ కన్ను వేసి ఉంచుతారన్న విషయం తాజా ఎపిసోడ్ తో స్పష్టమైందని చెప్పక తప్పదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos