రాజకీయ లబ్ధికే ఫిర్యాదులు

అమరావతి:వైకాపా అధ్యక్షుడు జగన్‌ వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమేతన బాబాయి వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు గురించి ఆయన భార్య సౌభాగ్య, కుమార్తె సునీతారెడ్డిలతో ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఇక్కడ ఆరోపించారు. వివేకా కూతురు వ్యాఖ్యల్లో రోజు రోజుకూ వైరుధ్యాలు కనిపిస్తున్నాయని చెప్పారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ చేస్తున్న అరాచకాలు అన్నింటికీ మోదీ వంత పాడుతున్నారని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos