నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు

ముంబై:దేశీయ స్టాక్ బుధ వారం మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించిన మార్కెట్లు , మధ్యాహ్నం రెండు గంటల వరకు అదే వరవడిని కొనసాగించాయి. చివర్లో ఇంధన, మందుల తయారీ, మోటారు వాహనాల రంగాల స్టాకుల అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు నష్ట పోయి 38,132కి పడి పోయింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,445 వద్ద
ఆగింది. యస్ బ్యాంక్ (5.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.57%), బజాజ్ ఆటో (1.18%), వేదాంత (1.12%) లాభపడగా, ఎన్టీపీసీ (-2.25%), టాటా మోటార్స్ (-1.85%), భారతి ఎయిర్ టెల్ (-1.49%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.25%). బాగా నష్ట పోయాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos