మోదీకి ‘రంగస్థల దినోత్సవ’ శుభా కాంక్ష లు : రాహుల్‌

న్యూఢిల్లీ : కింది కక్ష్యలో సంచరించే ఉపగ్రహాల్ని తుత్తునియలు చేసే క్షిపణి ప్రయోగం విజయవంత మైనందుకు రక్షణ, పరిశోధన, అభివృద్ది సంస్థ శాస్త్ర వేత్తల్ని అభినందించిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి కూడా చురక లంటించారు. ‘వెల్‌డన్ డీఆర్‌డీవో. మీ కృషి చూసి గర్విస్తున్నాం. ప్రధాని మోదీకి కూడా హ్యాపీ వరల్డ్ థియేటర్ డే (ప్రపంచ రంగస్థల దినోత్సవం) శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’అని ట్వీట్‌ చేసారు. ఉపగ్రహ విచ్ఛేదక క్షిపణి ప్రయోగాన్ని మోదీ ఎన్నికల ప్రచార సాధనంగా మలచుకున్నందుకు రాహుల్‌ గాంధీ అలా ఎగతాళి చేసారు. ‘ఈ ఘనత సాధించిన ఇస్రో, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతో పాటు ఈ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు. దేశాన్ని భద్రంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదా ల’నీ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్ ట్వీట్‌ చేశారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తా: మమత
‘మిషన్ శక్తి’ విజయవంతమైందని మోదీ ప్రకటించగానే చేయగానే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇంతకంటే సరైన సమయం మీకు దొరకలేదా అని దుయ్యబట్టారు.’మీ నాటకాలకుపరిమితులు లేవు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాలే మీ ముఖ్యోద్దేశం. ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే’ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రకటనకు ఎంచుకున్న సమయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ‘ప్రభుత్వం గడువు ముగుస్తోంది. మునిగిపోతున్న భాజపా పడవను గట్టు చేర్చేందుకు మోదీ ఇంత ఆదరాబాదరా ప్రకటన చేసి ప్రజలను మభ్యపెడుతున్నార’ని దుయ్యబట్టారు.
సమస్యలను పక్కదారి పట్టించేందుకే: అఖిలేష్
దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఇవాళ నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, మహిళా భద్రత వంటి ఎన్నో సమస్యలు మనల్ని పీడిస్తున్నాయని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గుర్తు చేసారు. ‘ఈ ఘనత సాధించిన ఇస్రో, డీఆర్డీఓ శాస్త్రవేత్తలతో పాటు ఈ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు. దేశాన్ని భద్రంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదా ల’నీ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos