బకాయిల వసూలుకు సుప్రీంను ఆశ్రయించిన ధోనీ

  • In Sports
  • March 27, 2019
  • 202 Views

ధోనీ

ఢిల్లీ : ప్రచార ప్రకటనలకు సంబంధించి తనకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆమ్రపాలి అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ధోనీ ప్రచార కర్తగా వ్యవహరించారు. దీనికి సంబంధించి ఆ సంస్థ సుమారు రూ.40 కోట్లు ధోనీకి చెల్లించాల్సి ఉంది. 2009 నుంచి 2016 వరకు ధోనీ ఆ సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరించారు. అయితే కొనుగోలుదారులను మోసం చేశారంటూ ఆ సంస్థపై కేసులు నమోదు కాగా, అలాంటి సంస్థకు ప్రచారం చేసినందుకు సామాజిక మాధ్యమాల్లో ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ధోనీ ఆ సంస్థతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. అప్పటి వరకు రావాల్సిన బకాయిలు రూ.38.95 కోట్లను చెల్లించాల్సిందిగా ఆ సంస్థను ఆదేశించాలని ధోనీ అత్యున్నత న్యాయ స్థానాన్ని కోరారు. కాగా కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి సంస్థపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. దర్యాప్తు నిమిత్తం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లను కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos