‘న్యాయ్‌’ అమలు సాధ్యమే

చెన్నై: కనీస ఆదాయం పథకం ‘న్యూన్ తమ్ ఆయ్ యోజన- న్యాయ్’(న్యాయ్) అమలు సాధ్యమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అభిప్రాయ పడ్డారు. బుధవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. అనేక మంది ఆర్థిక నిపుణుల్ని సంప్రదించిన తర్వాత రూపొందించిన ఈ పథకాన్ని దశల వారీగా ఐదు కోట్ల పేద కుటుంబాలకు విస్తరిస్తామని తెలిపారు. కేంద్ర నిధుల పరిమాణం, దేశ వృద్ధి రేటు, తదితర అంశాల దృష్ట్యా ఇలాంటి భారీ పథకాల్ని అమలు చేసే సామర్థ్యం మన దేశానికి ఉందన్నారు. ప్రస్తుత ఐసీడీఎస్ లాంటి పథకాలను కొనసాగి స్తామని హామీ ఇచ్చారు. సామాజిక-ఆర్థిక ప్రగతి సాధించడమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన పథకాల రాయితీలపై న్యాయ్ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేద నిభరోసా ఇచ్చారు. కుటుంబ మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఈ డబ్బు జమవుతుందని వివరించారు. దీని వల్ల పన్ను రాబడి పెరుగుతుందని, వృద్ధి రేటు కూడా ఊపందుకుంటుందని అంచనా వేసామన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరి ఖాతాలోకి రూ.15 లక్షలు జమ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భాజపా ప్రకటించి నప్పుడు ఎవరైనా లెక్కలు అడిగారా అని కమలనాధుల్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావించిన న్యాయ్ పథకంపై విపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos