ఉపగ్రహాన్ని కూల్చే క్షిపణి ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లి: కింది కక్ష్యలో సంచరించే ఉపగ్రహాన్ని మూడు నిముషాల వ్యవధిలో తుత్తునియులు చేసే క్షిపణి (ఏ శ్యాట్ – మిషన్‌శక్తి ఆపరేషన్)ని రక్షణ అభివృద్ది పరిశోధన సంస్థ (డిఆర్‌డివో) బుధవారం విజయ వంతంగా ప్రయోగించింది. దీన్ని భారత్‌ సాధించిన అద్భుత అంతరి ప్రయోగంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దరిమిలా దేశ ప్రజలల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మార్చి 27 మనకు చరిత్రాత్మక రోజు. మనమంతా గర్వించదగ్గ క్షణం ఇది. భూమి , నీరు, గాలిలోనే కాదు అంతరిక్షంలోనూ మనల్ని మనం కాపాడుకోగలం. మిషన్ శక్తి- అత్యంత కఠినమైన ఆపరేషన్. అంతరిక్షంలోని ఉప గ్రహాన్ని పడగొట్టాం. ఏ శాట్ (యాంటీ శాంటిలైట్) క్షిపణిని భారత్ విజయవంతగా ప్రయోగించింది. ఇది తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఒక ఉప గ్రహాన్ని కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసింది. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నాం. ఏ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రయోగం కాదు. అంతర్జాతీయ నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించ లేదు. కేవలం మన దేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసింది మాత్రమే. అంతరిక్ష పరిశోధనా, ప్రయోగాల్లో అతిపెద్ద నాలుగో దేశంగా అవతరించింది. అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos