
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికలో తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 31వ తేదీన ఏపీకి రానున్నారు. విజయవాడలో ఈ నెల 31న జరగనున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.