వరుస పరాజయాలు,గెలిచిన అతకొద్ది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు,సీనియర్ నేతల రాజీనామాలు ఈ పరిణామాలన్నింటితో తెలంగాణ రాష్ట్రంలో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఒకచిన్న తీపివార్త లభించింది.రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుమేట్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో మూడుచోట్ల కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించడంతో కొద్ది రోజులుగా వరుసగా ఎదురుదెబ్బలు తింటూ కుదలైన కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట లభిచింది. కరీంనగర్-ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ పట్టభద్రల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తెరాస అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌పై 39వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస బలపరచిన, పూల రవీందర్ కాంగ్రెస్-వామపక్షాలు బలపరచిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. మొత్తం 18,558 ఓట్లు పోలవగా నర్సిరెడ్డికి 8,976 ఓట్లు,పూల రవిందర్‌కు 6,279 ఓట్లు పోలయ్యాయి. ఇక కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యా నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.మొత్తం 18,814 ఓట్లు పోలవగా రఘోత్తమరెడ్డికి 5,462 ఓట్లు పోలవగా తెరాస బలపరచిన పాతూరి సుధాకర్ 2,486 ఓట్లతో నాలుగవ స్థానానికి పరిమితమయ్యారు.శాసనసభ,పంచాయితీ ఎన్నికల్లో జో్రు చూపిన కారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరబడిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో తెరాస పతనానికి పునాదులు పడ్డాయంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.తెరాసపై ప్రజా వ్యతిరేకత మొదలైందని లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 184 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయడమే అందుకు నిదర్శనమని తెలుపుతున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు కొత్త శక్తి లభించినట్లయింది.ఇదే జోరును లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి సత్తా చాటుతామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..