ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా తరఫున ప్రచారం చేయడానికి
జాతీయ నాయకులు రానున్నారు. ఇప్పటికే జమ్ము, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా
పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఆంధ్రాలో ప్రచారానికి వస్తానని
ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్‌లు కూడా ప్రచారానికి రానున్నారు. ఈ నెల 28, 31 తేదీల్లో వారిద్దరూ ప్రచారాన్ని
నిర్వహించనున్నారు. విజయవాడ, వైజాగ్‌లలో వారి ప్రచార సభలు ఉంటాయి. ఆర్జేడీ నేత తేజస్వి
యాదవ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు కూడా ప్రచార సభల్లో పాల్గొంటారు.