ఢిల్లీ : భాజపా మంగళవారం విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల పదో జాబితాలో సినీ నటి జయప్రదతో పాటు మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు చోటు లభించింది. జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ స్థానం నుంచి ఎస్పీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌పై పోటీ చేయనున్నారు. మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి, వరుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి పోటీ చేయనున్నారు. రీటా బహుగుణ జోషి అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.