నవాజ్ షరీఫ్‌ కు బెయిల్‌

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీ ఫ్‌ కు పాకిస్థాన్‌ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆరు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. దేశంలో ఎక్కడైనా వైద్య చికిత్స తీసుకునేందుకు అనుమతించింది. అనారోగ్య కారణాల వల్ల పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసిందని పాక్ దినపత్రిక ‘డాన్’ వెల్లడించింది. వైద్య చికిత్స పూర్తైన తర్వాత నవాజ్ షరీఫ్ మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ఏడేళ్ల చెరసాల శిక్ష అనుభవిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos