బెంగళూరు దక్షిణలో బీజేపీ అనూహ్య నిర్ణయం

బెంగళూరు దక్షిణలో బీజేపీ అనూహ్య నిర్ణయం

బెంగళూరు, న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌ : కర్ణాటకలో భాజపా కంచుకోట
నియోజకవర్గాల్లో ఒకటైన బెంగళూరు దక్షిణలో ఈసారి యువనేతను పోటీలోకి దింపడం ద్వారా బీజేపీ
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అభ్యర్థుల ఎంపిక దశలో కూడా పేరు వినబడని 28 ఏళ్ల
బీజేపీ యువ మోర్చా కీలక నేత తేజస్వి సూర్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ద్వారా పార్టీ
శ్రేణులనే నివ్వెరపరిచింది. 1991 నుంచి ఈ స్థానాన్ని భాజపా గెలుచుకుంటూ వస్తోంది.
1996 నుంచి దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్‌ ఈ స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు.
ఇటీవల ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించారు. ఈ ఎన్నికల్లో ఆయన సతీమణి తేజస్విని ఈ
స్థానాన్ని ఆశించింది. తనకు టికెట్‌ ఖాయమనే ధీమాతో ఆమె ఒక పర్యాయం ప్రచారాన్ని కూడా
పూర్తి చేశారు. అయితే భాజపాలోని అంతర్గత కలహాల కారణంగా చివరి నిముషంలో పార్టీ ఆమెకు
మొండి చేయి చూపింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,
రాజ్యసభ మాజీ సభ్యుడు బీకే. హరిప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. కాగా తనకు ఇంత చిన్న వయసులోనే
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం దక్కడం పట్ల తేజస్వి సూర్య  ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos