
న్యూఢిల్లీ: నోట్ల రద్దు వల్ల గ్రామీణ ఉపాధి పూర్తిగా దెబ్బ తిన్నందుకు భాజపా క్షమాపణలు చెబుతుందా?అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి మంగళవారం ట్వీట్‌లో సవాలు విసిరారు. ‘ఆర్థిక అత్యాయిక పరిస్థితి అయిన నోట్ల రద్దీ వల్ల సంపనున్నులు, పెట్టుబడి దార్లకు నష్టమేం లేదు. గ్రామీణ భారతం కకావికలమైంది. దేశంలో చాలా మంది ఉద్యోగాల్ని కోల్పోయారు. మళ్లీ రోజూ వారీ కూలీలుగా మారిపోయారు. ఇంతటి ఘనకార్యాలనికి కారణమైన బీజేపీ క్షమాపణ చెబుతుందా?’ని ప్రశ్నించారు.