రాహుల్‌కు పోటీగా ‘కాంగ్రెస్’ నేత కొడుకు

అమేతి: కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటగా పరిగణిస్తున్న అమేతి లోక్సభ స్థానం నుంచి రాహుల్కు పోటీగా కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుడు హజీ సుల్తాన్ ఖాన్ కుమారుడు హజీ హరూన్ రషీద్ బరిలోకి దిగనున్నారు. గత కొన్నేళ్లుగా స్థానిక నాయకత్వం తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వనందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 1991 ఎన్నికల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, 1999 ఎన్నికల్లో సోనియా గాంధీ అభ్యర్థిత్వాల్ని సమర్థిస్తూ నామపత్రాల్లో సంతకాలు చేసిన వారిలో సుల్తాన్ ప్రముఖుడు. తమ వర్గం మొత్తం పార్టీ స్థానిక నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉందన్నారు. ‘స్థానిక కాంగ్రెస్ నాయకత్వం దీని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడంతో పాటు ఇక్కడి మా సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది’ అని రషీద్ తెలిపారు. ‘ఈ నియోజక వర్గంలో దాదాపు 6.5లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేస్తార’ని వివరించారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి తన తండ్రి సుల్తాన్ దిగిన ఫొటోలను ఆయన మధ్యమ ప్రతినిధులకు చూపించారు. అమేతిలో రాహుల్కు పోటీగా భాజపా తరఫున స్మృతి ఇరానీ రెండో సారి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా అవలీలగా అమేతిలో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి గట్టి పోటీని ఎదుర్కోనుందని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos