భీమవరం : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్‌కు నామినేషన్
దశలోనే చుక్కెదురైంది. సమయం మించిపోవడంతో ఆయన నామినేషన్‌ను స్వీకరించడానికి అదికారులు
తిరస్కరించారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసన సభ స్థానానికి నామినేషన్
వేయడానికి వచ్చారు. ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు
ముందే తన బంధువుతో నామినేషన్ పత్రాలను పంపించారు. ఆయన వచ్చాక అధికారులు నామినేషన్
పత్రాలను పరిశీలించారు. వాటిపై సంతకం చేయాల్సి ఉండగా, అప్పటికే సమయం మించిపోయిందని
చెబుతూ అధికారులు నామినేషన్‌ను స్వీకరించడానికి నిరాకరించారు.