హైదరాబాద్ : తగినంత సమయం లేనందున పెద్దపల్లి లోక్‌సభ స్థానం
నుంచి తాను పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. శ్రేయోభిలాషులు, మద్దతుదారులు
పోటీ చేయోలని ఒత్తిడి తెస్తున్నా, చివరి నిముషంలో ఏమీ చేయలేకపోతున్నానని సోమవారం విడుదల
చేసిన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే చివరి నిముషం దాకా నాన్చి, తనకు టికెట్టు
లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్ కీలుబొమ్మలు తాను పార్టీకి వ్యతిరేకంగా పని చేశానంటూ
తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.