ముంబై : ఐపీఎల్‌లో ఆదివారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో
గాయపడిన జస్ప్రీత్ బుమ్రా గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని అతను ప్రాతినిధ్యం
వహిస్తున్న ముంబై ఇండియన్స్ ప్రకటించింది. అది మామూలు గాయమేనని, తదుపరి మ్యాచ్‌కు
అతను సిద్ధంగా ఉంటాడని తెలిపింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరులో పంత్ కొట్టిన బంతిని
ఆపబోయే ప్రయత్నంలో బుమ్రా ఎడమ భుజాన్ని పట్టుకుని విలవిలలాడాడు. తర్వాత బ్యాటింగ్‌కు
కూడా రాలేదు. దీంతో అతని గాయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అతని భుజం కుదించుకుపోయిందని,
అదేమంత పెద్ద గాయం కాదని ముంబై ఇండియన్స్ తెలిపింది.