
ఢిల్లీ : నటి జయప్రద బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. గతంలో
సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న ఆమెను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై
పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత ఆమె అమర్‌సింగ్‌తో కలసి రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే
పార్టీని స్థాపించారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పుటికీ
ఒక్క సీటూ దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్
నాయకుడు అజాంఖాన్‌పై ఆమెను పోటీ చేయించాలని బీజేపీ యోచిస్తోంది.