
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిష్పాక్షికత పట్ల నమ్మకం లేనందున వైకాపా సీనియర్ నేత వైఎస్ వివే కానంద రెడ్డిని హత్య కేసును సిబిఐ లేక మరో సంస్థ ద్వారా విచారణ జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన భార్య సౌభాగ్యమ్మ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దీన్ని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.వివేకా నంద రెడ్డి హత్య కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించింది. వివేకా నంద రెడ్డి మరణం గురించి అధికార, విపక్షాల మధ్య ఆరోపనలు, విమర్శల పరస్పర దాడులు ఎడతెగకుండా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని సౌభాగ్యమ్మ పిటిషన్లో తేట తెల్లం చేసారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని వైకాపా వైసీపీ అధినేత జగన్ ఇది వరకే టికే ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యానిన దాఖలు చేసారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతుండగానే హతుడు వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఉన్నత న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేయటం చర్చనీయాంశమైంది.