
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రతి అడుగూ మోసమేనని వై.కా.పా.అధినేత వై.ఎస్. జగన్ ఆరోపించారు. మామ ఎన్టీఆర్నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వెన్నుపోటు పొడవడం ఎంత పని? అని ఎగతాళి చేసారు. దళారులకు చంద్రబాబు నేతగా మారారని మండి పడ్డారు. మోసాలు, వెన్నుపోట్లే చంద్రబాబు పాలన చరిత్ర అని ధ్వజమెత్తారు.