ఎరువుల కోసం కాదు..నామినేషన్లు దాఖలు కోసం..

ఎరువుల కోసం కాదు..నామినేషన్లు దాఖలు కోసం..

ఏంటి ఈ క్యూ లైన్లు చూసి రైతులు ఎరువుల కోసమో లేదా విత్తనాల కోసమో బారులు తీరారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే..ఎందుకంటే రైతులు బారులు తీరింది విత్తనాల కోసమే..ఎరువుల కోసమో..బ్యాంకుల ముందో కాదు.నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టర్‌ కార్యాలయం ముందు బారులు తీరారు.అవును మీరు విన్నది నిజమే నిజంగానే రైతులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకొని నామినేషన్లు దాఖలు చేయడానికి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బారులు తీరారు.పంటలకు మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తమ ఆవేదనను  పట్టించుకోకపోవడంతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఆ స్థానంలో దాఖలైన 56 నామినేషన్లలో 50 మంది రైతులే ఉన్నారు. నామినేషన్ల స్వీకరణకు గడువు నేటితో ముగుస్తుండడంతో మరికొంత మంది రైతులు నామపత్రం దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పసుపు, ఎర్రజొన్న రైతులతో పాటు చెరకు రైతులు నామినేషన్ వేయనున్నారు. రెంజల్ మండల చెరకు రైతులు నామినేషన్ వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos