
అమరావతి:‘విధానసభ ఎన్నికల్లో వైకాపా గెలిస్తే పింఛన్లు ఆగిపో తాయి. పంట పొలాలకు నీళ్లు కూడా రావు. వైకాపా నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలిచినా కేసీఆర్‌కే లాభమ’ని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి నుంచి ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెదేపా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ తన భవిష్యత్తు కోసం తెలు గు వారికి శాశ్వత సమాధి కట్ట దలచారని ఆరోపించారు. ‘జగన్‌వి పిరికిపంద రాజకీయాలు. కేసీఆర్, కేటీఆర్‌కు భయపడుతూ వారి వద్ద బానిసలా పడి ఉన్నాడు. 60 ఏళ్లు కష్ట పడిన ఆస్తుల్ని వారు లాగేసుకున్నారు. ఇప్పుడు జగన్ ద్వారా మనం కష్టపడి నిర్మించుకుంటున్న నవ్యాంధ్ర ఆస్తులను కూడా లాగేందుకు కుట్ర పన్నారు. పౌరుషంతో మన ఆస్తులను మనం కాపాడుకుందాం. హైదరాబాద్‌లోని ఆంధ్రుల్ని వేదిస్తే ఉపేక్షించేది లేదు. హైదరా బాద్‌కు తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఉండాలనేది కేసీఆర్ భావన’ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తెదేపాను, వైకాపాను ఒకే గాటన కట్టడాన్ని తప్పు బట్టారు. ‘లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఒకటి చెప్పటం జగన్ తత్వమని విమర్శించారు. జగన్ లాంటి కరుడు గట్టిన నేర గాళ్ల విచారణకు ఎఫ్‌బీఐలో ప్రత్యేక అధ్యాయం ఉంది. దోచుకోవడమే తప్ప సంపద సృష్టించడం జగన్ చేత కాద’న్నారు. తెలుగు దేశం పార్టీ విజయాన్ని సాధించి మళ్లీ రాజ్యాధికారాన్ని చేపడితే తలసరి పింఛను మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుతామని ఇచ్చారు. వృద్ధాప్య ఫించన్లు పొందే వారి అర్హత వయసును తగ్గిస్తామనీ చెప్పారు. మూడు వందల చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఉచితంగా ఇళ్లు నిర్మించి పేదలకు వితరణ చేస్తామని కూడా హామీ ఇచ్చారు.