మంత్రాలకు ఎటువంటి
జబ్బులైనా,సమస్యలపై ఇట్టే పరిష్కారమవుతాయని గిరిజన,గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది నిలువు
దోపిడీకి గురవుతున్నారో అంతేమంది మంత్రాల,క్షుద్రపూజలు చేస్తున్నారని అమాయకులను చంపేస్తుండడం
వివస్త్రలను చేసి ఊరేగిస్తున్న ఘటనలు కూడా తరచూ ఏదోఒక చోట జరుగుతూనే ఉన్నాయి.తాజాగా
ఇటువంటి ఘటనే నిర్మల్ జిల్లా ఖానాపుర్ మండలం బాదనకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామంలోని
పాదం ఎర్రన్న అనే వ్యక్తి భార్యకు మంత్రాలు,క్షుద్రపూజలు తెలసని భావించిన గ్రామస్థులు
వారి పశువుల పాకను తగులబెట్టడానికి నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి
ఎర్రన్న పశువుల పాకంగా భావించి పక్కనే ఉన్న బుచ్చన్న అనే వ్యక్తి పశువుల పాకకు నిప్పు
పెట్టారు.కొద్ది సేపటికి జరిగిన తప్పు తెలుసుకొని ఎర్రన్న పశువుల పాకగా భావించిన పొరపాటున
మీ పాకను తగులబెట్టామని ఏమీ అనుకోవద్దని క్షమించి డబ్బులు తీసుకోవాలంటూ లేఖ రాసి పెట్టడంతో
పాటు రూ.30వేల నగదు కూడా ఉంచారు.అయితే తాము అనుకున్న విధంగానే మరుసటి రోజు ఎర్రన్న
పశువుల పాకకు నిప్పు పెట్టడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు..