టాటా మోటార్స్ ఏప్రిల్ నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు శనివారం ప్రకటించింది. రూ.25 వేల దాకా ధరలు పెరుగుతాయని వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధర పెరుగుదల ఉంటుందని పేర్కొంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఇన్‌పుట్ వ్యయాల కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని వివరణ ఇచ్చింది. టాటా మోటార్స్‌లో ఈ ఏడాదిలో కార్ల ధరలను పెంచడం ఇది రెండో సారి. జనవరిలో రూ.40 వేల దాకా ధరలను పెంచింది.