
లక్నో: దేశంలో భాజపాను మించిన కులోన్మాద రాజకీయ పక్షం మరొకటి లేదని సమాజ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.శనివారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాలకు విప క్షాలు గండి కొట్టాయని మోదీ చేసిన వ్యాఖ్యలను ‘ఎన్నికల గిమ్మిక్’గా అభివర్ణించారు. భాజపా నుంచి పాఠాలు చెప్పించుకునే ఖర్మ తమకు ఎంత మాత్రం లేదు. వాళ్లా మాకు పాఠాలు చెప్పేది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుండగా బీజేపీకి సొంత అభ్యర్థులు కూడా లేని దుస్థితి ఉంది. దాంతో ఇతర నేతలందర్నీ తమ నేతలుగా చెప్పుకుంటున్నార’ని ఎద్దేవా చేసారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఎవరు లబ్ధి పొందారో ప్రజలకు చెప్పాలని డిమాండు చేసారు. ఉపాధి, స్త్రీ-పురుష సమానత్వం వంటి ఎన్నో సమస్యల్ని సమాజం ఎదిరిస్తోందన్నారు. రామ్మనోహర్ లోహియా ఈ రోజు జీవించి ఉంటే భాజపా విధానాలు, రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పేవార న్నారు.