విజయ్‌ మల్య బెంగళూరు ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: భారత బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న మద్యం వ్యాపారి విజయ్ మల్య బెంగళూరులోని ఆస్తులను జప్తు చేయాలని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ శనివారం కర్ణాటక పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) కింద దాఖలైన కేసుకు సంబంధించి ఈ ఉత్తర్వు ఇచ్చారు. మరి కొంత సమయాన్ని కేటాయించాలని ఈడీ ప్రత్యేక న్యాయ వాదులు ఎన్.కే. మిశ్రా, సంవేద్ర వర్మ చేసిన వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. వచ్చే జూలై 10లోగా విజయ్ మల్య ఆస్తులను జప్తు చేయాలని, విచారణను అదే రోజుకు వాయిదా రోజుకు వాయిదా వేసింది. ఇది వరకూ దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు బెంగళూరు పోలీసులు న్యాయ స్థానానికి తెలిపారు. ఆర్థిక నేరగాడుగా కోర్టు మల్యను ఇది వరకే ప్రకటించింది. ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. మల్య పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా అమలుకు నోచుకోకుండా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos