
న్యూఢిల్లీ: ప్రధాని పోటీ చేయనున్న వారణాసి లోక్సభ నియోజక వర్గంలో ఈ సారి భారీ పోటీ నెలకోనుంది. రైతుల సమస్యల్ని తాత్సారం చేసినందుకు నిరసనగా భారీ సంఖ్యలో రైతుల్ని అక్కడ పోటీకి దించాలని దక్షిణాది నదుల అనుసంధాన పథకం రైతు సంఘం తెలిపింది. మోదీకి వ్యతిరేకంగా 111 మంది తమిళ రైతుల్ని బరిలో దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ణు ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం అయ్యాకణ్ణు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గతంలో 15 రోజులపాటు రైతులు ఆందోళను చేసారు. కావేరీ వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ఆదుకోవాలని రైతులు ఆరు బయటే వంటా వార్పూతో నిరసించారు. మోదీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనకు వ్యతిరేకంగా నామ పత్రాన్ని వేసి నిరసిస్తామని గతంలోనే అయ్యా కణ్ణు ప్రకటించారు