హిందిలో గొంతు సవరించిన పాల్

విజయవాడ: ఎల్లపుడూ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే ప్రసంగించే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ. పాల్ శనివారం గతంలో ఎన్నడూ లేని విధంగా హిందీలో ప్రసంగించి అలరించారు. ఇక్కడ జరిగిన మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో తన హింది భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ‘ఝూట్ నయ్ బోల్తా.. కబీ బీ నయ్ బోలా.. కబీ ఝూట్ నయ్ బోలేంగే .బడా బడా బాత్ కర్తా.. కుచ్ కామ్ నయ్ కర్తా.. కమ్ సే కమ్ షురూ కరో’( ఎన్నడూ అబద్ధాలాడలేదు. ఇక పైనా ఆడను. పెద్ద పెద్ద మాటలు చెబుతారు. ఏ పనీ చేయరు. కనీసం ఇప్పుడైన చేయండి) అని విపక్షాల్ని విమర్శించారు. ఒక్కో విధానసభ అభ్యర్థిని ఐదు లక్షలు ఖర్చు పెట్టమని చెబుతున్నామని,వాళ్లూ అంతకంటే ఎక్కువగా అడగటం లేదని చెప్పారు. చంద్ర బాబు, జగన్, పవన్లకు ఓటెయ్యొద్దని, వాళ్లు తిరిగే హెలికాఫ్టర్కు వెయ్యాలని పిలుపు నిచ్చారు. ప్రజా శాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేయాలని కోరుతూ విజయ సాయి రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేసారు. తమకు ఓటర్లే జెండాలని తమకు ఎలాంటి జెండాలు లేవని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos