చంద్రబాబు దర్శకత్వంలో పవన్ ప్రదర్శన

కర్నూలు:తెదేపా అధినేత చంద్ర బాబు నాయకుడు దర్శకత్వంలోనే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఆరోపణలు చే సారని వై.కా.పా. నాయకుడు, మాజీ మంత్రి నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. మొన్న మొన్నటి వరకు తెలంగాణలోనే ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు తను ఆంధ్రుణ్ని అనటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. సిబిఐ మాజీ సంయుక్త సంచాలకుడు లక్ష్మి నారాయణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్థ రాత్రి మతనాలు సాగించారని దుయ్యబ ట్టారు. నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఆయనకు పోటీగాజనసేన అభ్యర్థిని ఎందుకు దింపలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి బీ టీమ్ లా జనసేన బీ టీమ్ లా పని చేస్తోందని, చంద్రబాబు డూపులా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ధ్వజ మెత్తారు. మంగళగిరిలో భుములు మింగిసేన వారికి మద్దతు ఇస్తారా అని పవన్ కల్యాణ్‌ ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా వైసిపి మీదనే విమర్శలు చేయటంలో ఆంతర్యం ఏమిటన్నారు. పవన్ కల్యాణ్ నామ పత్రాల దాఖలు కార్యక్రమంలో తెదేపా శ్రేణులు పాల్గొనడమే ఆ పార్టీతో కలసి జనసేన పని చేస్తోందని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు చెప్పిందే చేసినప్పుడు పవన్ కల్యాణ్ కు సొంత పార్టీ ఎందుకని ఎద్దేవా చేసారు. పవన్ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణలో ఆంధ్రవాళ్లపై ఎప్పుడు దాడులు జరిగాయో చెప్పాలని పవన్ కల్యాణ్ ను డిమాండు చేసారు. చంద్ర బాబు నాయుడును మించిన పెద్ద అవినీతి పరుడు ఉంటారాని ? హేళన చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos